రైతులకు అన్ని రకాల రుణాలు అందిస్తాం
అలంపూర్: డీసీసీబీ బ్యాంక్ ద్వారా రైతులకు అన్ని రకాల రుణాలు అందిస్తామని ఆ బ్యాంక్ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అలంపూర్ పీఏసీఎస్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో డీసీసీబీ బ్యాంక్‌ల ద్వారా ఈ ఏడాది రూ.1550 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఐదెకరాల పొలం ఉన్న రైతులకు కర్షకమిత్ర ద్వారా రూ.10 లక్షలు, మార్టిగేజ్ లేకుండా రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతు లకు ఇంటి నిర్మాణం కోసం రూ.25 లక్షలు, గ్రామా ల పరిధిలో ఉన్న రైతులకు ఇంటి కోసం రూ.15 లక్షల వరకు రుణాలు ఇస్తుందన్నారు. దేశంలో ఎక్కడైనా చదువుకోవడానికి రైతు బిడ్డలకు రూ.10 లక్ష లు, ఇతర దేశాల్లో విద్యను అభ్యసిస్తే రూ.35 లక్షల వరకు రుణ సౌకర్యం ఉందని పేర్కొన్నారు. రైతులకు బంగారంపై 15 నిమిషాల్లో రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న రూ.2 లక్ష ల రుణ మాఫీలో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.29 కోట్లు వచ్చినట్లు తెలిపారు. కాగా, మూడు సొసైటీలు కలిపి రూ. 50కోట్ల లావాదేవీలు పూర్త యిన సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment