విరబూసిన మామిడి
మొదటి దశలో దెబ్బతిన్నా.. నిలిచిన రెండో దశ పూతలు
ఆశాజనకంగా పూతలు
ప్రతి ఏటా మామిడి పూతలు నవంబర్ నెల నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈసారి నవంబర్‌లో వచ్చిన మొదటి పూతలు వాతావరణ మార్పుల కారణంగా చాలా చోట్ల దెబ్బతిన్నాయి. డిసెంబర్ నెలలో వచ్చిన రెండో దశ పూతలు నిలిచాయి. కొన్ని చోట్ల ఇంకా మొగ్గ దశలోనే పూతలు ఉన్నాయి. అయితే గతంలో కంటే ఈసారి పూతలు సమృద్ధిగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. పూతలు నిలిస్తే మామిడి దిగుబడులు ఈ ఏడాది భారీగా పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తేమ, చల్లటి గాలులతో..
మామిడి పంటకు ప్రధానంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. చలికాలంలో తేమ, చల్లటి గాలులు అధికంగా ఉంటే పూతకు పురుగు ఆశించి నష్టం చేకూరుస్తుంది. ఇటీవల కాలంలో వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పుల కారణంగా పూతలు కొన్నిచోట్ల మాడిపోయాయి. మిగిలిన పూతలకు చీడపీడలు ఆశిస్తున్నాయి. ప్రధానంగా తేనె మంచు పురుగు, పక్షి కన్ను తెగులు, ఆకుచుట్టు పురుగు, బూడిద తెగులు, నల్లి తామర, మసిరంగు తెగులు తోటలను ఆశిస్తున్నాయి. వీటి నివారణకు రైతులు రూ.వేలు వెచ్చించి రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. మామిడి దిగుబడిపై రైతులకు ఆశలు చిగురిస్తున్నప్పటికీ.. చీడపీడలు వారిని కలవరానికి గురిచేస్తున్నాయి.
కొల్లాపూర్: జిల్లాలో ఈ ఏడాది మామిడి తోటలు రైతులను ఊరిస్తున్నాయి. మామిడి పూతలు విరగబూశాయి. మొదటి దశ పూతలు దెబ్బతిన్నప్పటికీ.. రెండో దశ పూతలు బాగా రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో తరుచుగా ఇబ్బందులు పెడుతున్న వాతావరణ మార్పులు తోటలపై మరోసారి ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు చీడపీడల బాధలు ప్రారంభమయ్యాయి. వీటి నివారణకు సస్యరక్షణ చర్యలే మార్గమని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.
నియోజకవర్గం సాగు విస్తీర్ణం దిగుబడి అంచనా
(ఎకరాల్లో) (మెట్రిక్ టన్నులు)
కొల్లాపూర్ 25,237 1,00,946
కల్వకుర్తి 4,547 18,188
నాగర్‌కర్నూల్ 2,510 10,042
అచ్చంపేట 2,418 9,672
జిల్లాలో మామిడి సాగు
వివరాలు ఇలా..
వాతావరణ మార్పులతో
తప్పని చీడపీడల బెడద
వాతావరణం అనుకూలిస్తేనే మంచి దిగుబడులు
సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటున్న ఉద్యాన శాఖ అధికారులు
జిల్లాలో 34,712 ఎకరాల్లో మామిడి తోటల సాగు
Comments
Please login to add a commentAdd a comment