కార్యకర్తలే పార్టీకి బలం
తెలకపల్లి: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలకపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయడంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని.. 30 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరిందన్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. పోలీసు కేసులు పెట్టినా మనోధైర్యం కోల్పోకుండా పార్టీ కోసం పనిచేశారని గుర్తుచేశారు. కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య రాకుండా చూస్తానన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రూపు రాజకీయాలకు తావివ్వకూడదని తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, వైస్ చైర్మన్ బోపాస్ చిన్న జంగయ్య, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ మామిళ్లపల్లి యాదయ్య, మాజీ జెడ్పీటీసీ సుమిత్ర, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్యగౌడ్, మాజీ ఎంపీపీ బండ పర్వతాలు, మనోహర్ రెడ్డి, పర్వత్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment