‘భూ కబ్జాదారులను వదిలిపెట్టం’
కల్వకుర్తి రూరల్/ఊర్కొండ: గిరిజనుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. భూ కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ అన్నారు. ఊర్కొండ మండలం గుండ్లగుంటపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్యా తండాకు చెందిన గిరిజనుల భూములను కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఆర్డీఓ శ్రీనునాయక్, తహసీల్దార్ రామకోటికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 80 ఏళ్లుగా భూమిని సాగుచేస్తూ జీవనం సాగిస్తున్న గిరిజనుల భూములను ఆక్రమించిన వారితో పాటు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ కబ్జాదారులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి, గిరిజనులకు భూమి తిరిగి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, బోడ నరసింహ, రవిగౌడ్, పట్టణ అధ్యక్షుడు బాబీ దేవ్, లక్ష్మీనర్సింహ, రాజేందర్ గౌడ్, దివాకర్, లక్ష్మణ్ గౌడ్, ఆంజనేయులు తిరుపతి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment