క్రమశిక్షణకు మారుపేరు పోలీసులు
నాగర్‌కర్నూల్ క్రైం: విధి నిర్వహణలో 24 గంటలపాటు శ్రమిస్తున్న పోలీసులకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్యూవల్ స్పోర్ట్స్ మీట్–2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసికోల్లాసం, ఐక్యతను నేర్పిస్తుందన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్యూవల్ స్పోర్ట్స్ నిర్వహించామన్నారు. ఈ పోటీలు ఈ నెల 23 వరకు జరుగుతాయని, ఇందులో జిల్లాలోని 22 పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న 6 జట్లు పాల్గొంటాయని చెప్పారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణకు మారుపేరని క్రీడల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకుని పోలీస్ శాఖకు పేరు తీసుకురావాలన్నారు. అన్యూవల్ స్పోర్ట్స్ మీట్‌లో పోలీస్ సిబ్బందికి కబడ్డీ, క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్‌తోపాటు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ శ్రీనివాస్, వెంకటేష్, సత్యనారాయణ, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment