దరఖాస్తుల స్వీకరణ
నాగర్‌కర్నూల్ రూరల్/ కందనూలు: తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి 8వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గోపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 28లోగా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ www.tmreistelangana.cgg.gov.in దరఖాస్తు చేసుకుని, వాటిని కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఏప్రిల్ 24న 5, 6, 7, 8వ తరగతి ప్రవేశ ప్రక్రియ ఉంటుందన్నారు. కళాశాల విద్యార్థులకు మే 1 నుంచి 10 వరకు పరిశీలన ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 79950 57971, 73311 70833, 79974 43329, 73311 70834లను సంప్రదించాలని చెప్పారు.
సామాజిక భద్రత పథకంలో లోపాలు సవరించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: సామాజిక భద్రత పథకంలోని లోపాలు రాష్ట్ర ప్రభుత్వం సవరించాలని ఫోర్‌వీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రవాణా, రవాణాయేతర, ఆటో, క్యాబ్‌డ్రైవర్లు, హోంగార్డులకు సంబంధించిన సామాజిక భద్రత పథకంలో బీమా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలన్నారు. లబ్ధిదారులతో పథక ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక ప్రచారం చేపట్టాలని కోరారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే మైనింగ్ అనుమతులు
అచ్చంపేట: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైలారం మైనింగ్ అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మంగళవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. అక్రమ ఇసుక రవాణాపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఇసుక, ల్యాండ్ మాఫియాకు వెన్నుదన్నుగా ఉన్నది ఎవరో ప్రజలకు తెలుసు అని వివరించారు. ఆలయాల్లో రాజకీయాలు చేయ డం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్ని కల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ధి రాలేదని విమర్శించారు. తాను మాజీ మంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్‌ను ఆదర్శంగా తీసుకొని అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు మల్లయ్య, కౌన్సిలర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment