రాష్ట్రానికి ఇచ్చింది గుండుసున్నా..
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కింది మళ్లీ గుండుసున్నానే. ఎన్నికలు జరగనున్న బీహార్‌పైనే కేంద్రం బడ్జెట్‌ను కేటాయించింది. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. లక్షల కోట్ల పన్నులు కడుతున్నా.. సగం కూడా నిధులు కేటాయించడం లేదు. పాలమూరు ప్రాజెక్టు, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి కోసం ఏమాత్రం నిధులు ఇవ్వకపోవడం అన్యాయం.
– కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్
గొప్ప విషయం..
కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రూ.12 లక్షలకు పెంచడం గొప్ప విషయం. ఇది ఉద్యోగులు, మధ్య తరగతి వారికి ఎంతో ప్రయోజనకరం. మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహకం, మౌళిక రంగం, సుస్థిర అభివృద్ధి, స్టార్టప్స్, మీడియం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ప్రోత్సాహకం ఇవ్వడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. వ్యవసాయం, పేద, మధ్య తరగతి వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
– గడ్డం జిమ్మీకార్టన్, హెచ్‌ఓడీ ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్, పీయూ
Comments
Please login to add a commentAdd a comment