పేదలకు అన్యాయం..
కేంద్ర బడ్జెట్ పేదలకు అన్యాయం చేసే విధంగా ఉంది. సామాన్యులు చాలా వరకు వ్యవపాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తుంటే.. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధులను తక్కువగా కేటాయించారు. విద్య, ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. తమ సొంత వారి కోసం చేసుకున్న బడ్జెట్‌లా ఉంది. రాబోయే ఎన్నికల కోసం ముందస్తు తాయిలాలను ప్రకటించినట్టుగా బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.
– కసిరెడ్డి నారాయణరెడ్డి,
ఎమ్మెల్యే, కల్వకుర్తి
రాజకీయ అవసరాలకే..
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంతో పాటు జిల్లాకు మొండిచెయ్యి చూపారు. రాజకీయ అవసరాల కోసమే బడ్జెట్ ఉపయోగించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరిన ఏఒక్కటి ఇవ్వలేదు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించకపోగా.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మాచర్ల–గద్వాల కొత్త రైల్వేలైన్ మంజూరుకు అతీగతి లేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఏమీ సాధించలేకపోయారు.
– డా.చిక్కుడు వంశీకృష్ణ,
డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, అచ్చంపేట
Comments
Please login to add a commentAdd a comment