నాగర్‌కర్నూల్ క్రైం: మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో నేరగాళ్లు మల్టీలెవల్ మార్కెటింగ్‌పై కన్నేశారని, గొలుసుకట్టు వ్యాపారంతో వాట్సాప్, ఫేస్‌బుక్, టెలీగ్రాం వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటనలు గుప్పించి అమాయకులను మోసం చేస్తున్నట్లు తెలిపారు. డెకథ్లాన్, యారా, విస్కీ యాప్‌లలో పెట్టుబడులు పెట్టకూడదని, అలా పెట్టిన చాలామంది మోసపోయారని చెప్పారు. మోసపూరిత ప్రకటనలపై సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment