రూ.10లక్షల నగదు స్వాధీనం | Sakshi
Sakshi News home page

రూ.10లక్షల నగదు స్వాధీనం

Published Tue, May 7 2024 5:30 AM

రూ.10లక్షల నగదు స్వాధీనం

● భువనగిరి డీసీపీ రాజేశ్‌ చంద్ర

భువనగిరి క్రైం: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో సోమవారం పోలీసులు తనిఖీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా రూ.10,09,480 నగదు స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి డీసీపీ రాజేశ్‌ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇద్దరిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి సోమవారం వరకు 4,189.81 లీటర్ల మద్యం, రూ.1,22,50,030 నగదు, 5.91 కిలోల గంజాయి, 53 జిలిటెన్‌ స్టిక్స్‌, 6925 కేజీల ఐరియల్‌ బూస్టర్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు 658 మందిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 14 లైసెన్స్‌ గన్‌లను డిపాజిట్‌ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement