ఫ తిరుగు ప్రయాణం తిప్పలు
కేతేపల్లి : హైదరాబాద్–విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ కొనసాగింది. దీపావళి పండగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వచ్చి తిరిగి వెళ్లే వారి వాహనాలతో పాటు ఆదివారం శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులుదీరాయి. వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్‌ప్లాజా నిర్వాహకులు హైదరాబాద్ వైపు అదనపు కౌంటర్లు ఏర్పాట్లు చేయకపోవటంతో టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు అర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment