పేద పిల్లల భవిష్యత్తే లక్ష్యం
గరిడేపల్లి: పేద పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇంగ్లిష్ మీడియంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించ తలపెట్టామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ.200కోట్ల నిధులతో నూతనంగా నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంట్రిగేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. 2,500 మంది విద్యార్థులు చదువుకునేలా ఈ పాఠశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హుజూర్‌నగర్‌ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్న ఈ పాఠశాలలో 4 నుంచి 12వ తరగతి వరకు 2,500మంది విద్యార్థులు చదువబోతుండడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గడ్డిపల్లి నుంచి పాఠశాల వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే నిధులను మంత్రిగా తాను తక్షణమే మంజూరు చేయిస్తానన్నారు. ఈ పాఠశాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, డీఆర్‌డీఓ కోటేశ్వరరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శంకరయ్య, లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఇళ్ల ప్రారంభోత్సవానికి మళ్లీ రావాలి
హుజూర్‌నగర్: హుజూర్‌నగర్‌లో త్వరలో జరగబోయే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్లీ రావాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. ఆదివారం మంత్రులు హెలికాఫ్టర్‌లో హుజూర్‌నగర్‌కు వచ్చి స్థానిక రామస్వామి గుట్ట వద్ద డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించిన సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. చీకటి పడుతుండడంతో మంత్రులు వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
గడ్డిపల్లిలో యంగ్ ఇండియా
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment