సమగ్ర సర్వేలో తప్పులు ఉండొద్దు
చిట్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, కుటుంబ సమగ్ర సర్వేలో తప్పులకు తావివ్వకుండా జాగ్రత్తగా నిర్వహించాలని ఎన్యుమరేటర్లకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి అనితారామచంద్రన్ సూచించారు. చిట్యాల మున్సిపాలిటీలోని పదో వార్డులో శనివారం ప్రారంభమైన కుటుంబ సమగ్ర సర్వే తీరును ఆమె పరిశీలించారు. కుటుంబ సభ్యుల సమాచారాన్ని సేకరిస్తున్న తీరును ఎన్యుమరేటర్లను అడిగారు. అలాగే అందుతున్న సంక్షేమ పథకాలను, ఇతర ఇబ్బందులను ఆమె స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అంతకుముందు చిట్యాలలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్య నిల్వలు, ఽతూకం వేసిన ధాన్యాన్ని ఆమె పరిశీలించి మహిళా రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణనాయక్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, పీఏసీఎస్ సీఈఓ బ్రహ్మచారి, సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు.
ఫ ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి అనితారామచంద్రన్
Comments
Please login to add a commentAdd a comment