కార్యదర్శులు అప్పులపాలు! | - | Sakshi
Sakshi News home page

కార్యదర్శులు అప్పులపాలు!

Published Wed, Nov 20 2024 1:19 AM | Last Updated on Wed, Nov 20 2024 1:19 AM

కార్య

కార్యదర్శులు అప్పులపాలు!

నల్లగొండ : పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు. గ్రామ పంచాయతీలో పాలకవర్గాల కాలపరిమితి తీరడంతో నిర్వహణ భారమంతా పంచాయతీ కార్యదర్శులపైననే పడింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 10 నెలలుగా కార్యదర్శులు అప్పులు తెచ్చి పనులు చేయిస్తున్నారు. ప్రధానంగా బ్లీచింగ్‌, వీధి దీపాలు, మోటార్ల మరమ్మతు, ట్రాక్టర్‌ డీజిల్‌ తదితర ఖర్చులను సొంతంగా భరించాల్సి వస్తుంది.

జిల్లాలో 844 పంచాయతీలు

జిల్లాలో 844 గ్రామ పంచాయతీలున్నాయి. పంచాయతీలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిధులు వచ్చాయి. ఎన్నికల ముందు నుంచే రాష్ట్ర నిధులు ఆగిపోయాయి. పంచాయతీల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులకు సర్పంచ్‌లు అప్పులు తెచ్చి నిర్వహించారు. ఫిబ్రవరి 2వ తేదీతో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిపోయింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు పంచాయతీలకు పైసా నిధులు ఇవ్వలేదు. దీంతో అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

రూ.25 కోట్ల వరకు ఖర్చు

గ్రామ పంచాయతీల్లో అత్యవసరమైన పనులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేక అధికారులను నియమించింది కానీ పైసలు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులే గ్రామాల్లో పనులకు సొంతంగా డబ్బులు వెచ్చిస్తున్నారు. పది మాసాల నుంచి నిధులు రాకపోవడంతో వారంతా అప్పులపాలవుతున్నారు. గతంలో సర్పంచ్‌లు ఉన్న సమయంలో అన్నీ వారే చూసుకునేవారు. ఇప్పుడు ఆ భారం కార్యదర్శులపైనే పడింది. చిన్న పంచాయతీల్లో అయితే.. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు, పెద్ద పంచాయతీల్లో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇలా జిల్లాలో కార్యదర్శులు సుమారు రూ.25 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఫ 10 నెలలుగా పంచాయతీలకు ఆగిన నిధులు

ఫ అత్యవసర పనులకు సొంతంగానే ఖర్చు

ఫ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి వేడుకోలు

నిధులు ఇవ్వాలని విన్నవించాం

పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేస్తున్నారు. నిధులు విడుదల చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, డీపీఓ, పంచాయతీ అధికారికి తమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాలు సమర్పించాం. ప్రభుత్వం కూడా త్వరలోనే నిధులు ఇస్తానని సంఘ నేతలకు హామీ ఇచ్చింది. త్వరగా ఇవ్వాలని కోరుతున్నాం.

– ఖాసీం, టీఎన్‌జీఓ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
కార్యదర్శులు అప్పులపాలు!1
1/1

కార్యదర్శులు అప్పులపాలు!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement