రెండవ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి
నల్లగొండ టూటౌన్ : పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, రెండవ పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పందిరి శ్యాంసుందర్ డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలని, 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌కు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, అసోసియేషన్ నాయకులు కుంభం సత్తిరెడ్డి, ఎడ్ల సైదులు, పాదూరి విద్యాసాగర్‌రెడ్డి, ఎండీ. అబ్ధుల్ ఖాదర్, వనం శ్రీవాణి, వాడపల్లి రమేష్, గుండాల భిక్షమయ్య, పి.సత్యనారాయణ, పి.రమణారెడ్డి, చాపల అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, మహర్షి, వై.సత్తయ్య, పరశరాములు, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment