శాలిగౌరారం: ప్రస్తుత వానాకాలం పంట సీజన్‌లో ఇప్పటివరకు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శాలిగౌరారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు చేసిన రికార్డులతో పాటు ట్రక్‌షీట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ పంట సాగుకు జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కొంత ఆలస్యంగా సాగునీటి విడుదల జరగడంతో ధాన్యం కొనుగోలు డిసెంబర్‌లో కూడా కొనసాగిస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ యాదగిరి, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి, పీఏసీఎస్ సీఈఓ ఆంజనేయులు, ఐకేపీ ఏపీఎం జానకి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment