మిర్యాలగూడ: దామరచర్ల మండల కేంద్రంలోని అద్దంకి– నార్కట్‌పల్లి రహదారిని అనుసంధానం చేస్తూ వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ వరకు 12కిలోమీటర్ల మేర ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి నిర్మాణానికి రూ.236కోట్ల అంచనా వ్యయంతో నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా సీఎంవో ఆమోదంతో పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి బొత్తలపాలెం నుంచి విష్ణుపురం వరకు అనుకూలమైన ప్రదేశాలపై ఇటీవల సర్వే నిర్వహించి ఆరు ప్రాంతాలను గుర్తించారు. ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ మోహన్‌నాయక్ శనివారం ఐదు ప్రాంతాలను పరిశీలించి వాటిలో రెండు ప్రాంతాలను తొలగించారు. రెండు చోట్ల రోడ్డు, బ్రిడ్జి అవసరం కాగా మరోచోట ఆర్‌ఓబీ అవసరం ఉంటుందని అధికారులు గుర్తించారు. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, ఎమ్మెల్యేతో చర్చించి రహదారి నిర్మాణ అలైన్‌మెంట్ నిర్ధారించనున్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ డీఈఈ శ్రీనివాస్, గణేష్, రాంబాబు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment