నేడు సీపీఎం జిల్లా కమిటీ సమావేశం
మిర్యాలగూడ అర్బన్ : సీపీఎం జిల్లా కమిటీ సమావేశం సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పి.సుదర్శన్, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.
డేటా ఎంట్రీ
వేగవంతం చేయాలి
తిప్పర్తి : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల డేటా ఎంట్రీని వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. ఆదివారం తిప్పర్తి మండల పరిషత్ కార్యాలయంలో డేటా ఎంట్రీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డాటా ఎంట్రీ ఆపరేటర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిప్పర్తి మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఈఓ భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.
29న నల్లగొండలో
దీక్షా దివస్
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలో ఈ నెల 29న దీక్షా దివస్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్యగౌడ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ నిరాహార దీక్షకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందన్నారు. దీక్షా దివస్ విజయవంతం కోసం ఈ నెల 26న నల్లగొండలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మలే శరణ్యారెడ్డి, బోనగిరి దేవేందర్, దేప వెంకటరెడ్డి, గణేష్, కొండూరి సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, యుగేందర్‌రెడ్డి, మైనం శ్రీనివాస్, శంకర్, కె.లక్ష్మయ్య, కృష్ణ, బొజ్జ వెంకన్న, జంగయ్య, రాజేందర్, సునందరెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని కాపురాల గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని యునెస్కో సభ్యుడు ఆదోని వెంకటరమణరావు అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణం పాతబస్తీలోని ఆర్య సమాజ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని కాపురాల గుట్టను ఎకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కోరినట్లు తెలిపారు. గుట్ట పైకి రోడ్డును నిర్మిస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాలుచ సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ చూపి కాపురాల గుట్టను అభివృద్ధి చేయాలని కోరారు. సమావేశంలో ఓగ్గు గణేష్, రాంప్రసాద్, హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment