ఆహార పదార్థాలు కలుషితం కావొద్దు
నల్లగొండ : గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలుషితం కావొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గదితోపాటు సరుకులు నిల్వ ఉంచిన గది, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వంట గది కిటికీలకు ఈగలు, దోమలు రాకుండా మెస్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. వంట మనుషులు తలకు టోపీ, చేతికి గ్లౌజ్‌లు ధరించాలన్నారు. విద్యార్థులకు అప్పటికప్పుడే వండి వడ్డించాలని.. నిల్వ ఉంచిన పదార్థాలను పెట్టవద్దని ఆదేశించారు. అక్కడే పూరీలు చేసి.. విద్యార్థినులతో కలిసి టిఫిన్ చేశారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. భోజనం ఎలా ఉంది. మెనూ ప్రకారం పెడుతున్నారా? రోజూ ఎన్ని రకాల వంటకాలు పెడుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ విద్యార్థినులకు హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌సీఓ సంధ్య ఉన్నారు.
డేటా ఎంట్రీ చాలా ముఖ్యం
నల్లగొండ : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల డేటా ఎంట్రీ చాలా ముఖ్యమని, వివరాలను జాగ్రత్తగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాంచి నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇతర కారణాల వల్ల ప్రజలు ఇళ్ల వద్ద అందుబాటులో లేకపోతే ఫోన్ ద్వారా వివరాలు సేకరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలస వెళ్లిన వారి వివరాల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దుర్గారావు, సీపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ నల్లగొండలోని బీసీ బాలికల
గురుకులంలో ఆకస్మిక తనిఖీ
ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం పూర్తిచేయాలి
నల్లగొండ : జిల్లా కేంద్రంలోని ఐటీఐ ఆవరణలో నిర్మిస్తున్న అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)ను డిసెంబరు 4వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె ఏటీసీ నిర్మాణాన్ని పరిశీలించి మాట్లాడారు. డిసెంబర్ 4వ తేదీలోగా బాలుర స్కిల్ సెంటర్‌ను పూర్తి చేసి 5న ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment