నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి
నార్కట్‌పల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం భారత దేశప్రజల ఆలోచనలకు అనుగుణంగా లేదని దాన్ని వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా 6వ మహాసభలు నార్కట్‌పల్లిలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిప్ –2020 విద్య కొర్పొరేటీకరణ, కాశాయీకరణకు దారితీసే విధంగా ఉందన్నారు. అది ప్రభుత్వ విద్యా వ్యవస్థకు గొడ్డలిపెట్టులా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11 మంది డీఈఓలు, 33 మంది ఎంఈఓలు మాత్రమే రెగ్యులర్‌గా పని చేస్తున్నారని.. నూతన జిల్లాలు మండలాలకు డీఈఓ, ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ విద్యా కమిషనర్ ఆకునూరి మురళికి వివిధ సమస్యలకు సంబంధించి పలు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించే విధంగా విద్యా బోధనకు కృషి చేయాలన్నారు. త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్గుబెల్లి నర్సిరెడ్డి పోటీ చేస్తున్నారని.. ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు శ్రీనివాసచారి, బడుగు అరుణ, కోశాధికారి నర్రా శేఖర్‌రెడ్డి, ఆహ్వన సంఘం అధ్యక్షుడు భాను ప్రకాష్, కుకుడాల గోవర్ధన్, రాదారపు భిక్షపతి, నర్రా రవీందర్‌రెడ్డి, ఆదినారాయణ, వెంకన్న, పురుషోత్తం, వెంకన్న, సురేష్, నరేష్, హేమలత, శోభ, విజయలక్ష్మి, జ్యోతి తదితరులు ఉన్నారు.
ఫ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ఫ నార్కట్‌పల్లిలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా 6వ మహాసభ
టీఎస్‌యూటీఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
నల్లగొండ : టీఎస్ యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీని జిల్లా మహాసభలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బక్కా శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శిగా పెరుమాళ్ల వెంకటేశం, కోశాధికారిగా వడ్త్యా రాజు, ఉపాధ్యక్షుడిగా నర్రా శేఖర్‌రెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలిగా బండారు అరుణ ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment