వంద శాతం ఉత్తీర్ణతకు కృషిచేయాలి
పెద్దవూర: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి (ఏటీడీఓ) శ్రీనివాస్ అన్నారు. గురువారం పెద్దవూర మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల, ఎస్టీ రెగ్యులర్ హాస్టళ్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బందికి సంబంధించిన హాజరు పట్టిక, రికార్డులు, వంటగది, భోజనాలు, మూత్రశాలలు, వసతి గృహ పరిసరాలు పరిశీలించారు. మెనూ పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ప్రతి రోజు విధిగా ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది, విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నేషన్ ద్వారా నమోదు చేయాలన్నారు. వంట గది పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం బాలోజీ, వార్డెన్ కొల్లు బాలకృష్ణ, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment