మంత్రి కోమటిరెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సమేతంగా జరుపుకోవాలని సూచించారు. తెలంగాణలో సంక్షేమం, సుపరిపాలన ప్రగతిపథంలో ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజలంతా సంబురంగా సంక్రాంతిని జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఎస్పీ శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో అందరూ కలిసి మెలిసి సంతోషంతో పండగ జరుపుకోవాలని కోరారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. సంక్రాంతి ముగ్గులు వేసే సమయంలో మహిళలు, యువతులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
లక్ష డప్పుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
నకిరేకల్ : ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ వేల గొంతుల.. లక్ష డప్పుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాదిగ ఉద్యోగుల సంఘం (ఎంఈఫ్) రాష్ట్ర అద్యక్షుడు మంద దేవతాప్రసాద్ కోరారు. నకిరేకల్‌లో సోమవారం జరిగిన ఎంఈఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దశబ్దాలుగా దోపిడీకి గురవుతున్న మాదగ ఉప కులాలకు న్యాయం చేయాలన్నారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడి సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో చింత జాహ్నవిల్సన్, నకిరెకంటి గోపీనాథ్, నగేష్, కొంపెల్లి భిక్షపతి, నర్సయ్య, ఆడెపు జానయ్య, జిల్లా నర్సింహ, రామకృష్ణ, పండు గోపాల్, ఎర్ర వెంకటనారాయణ పాల్గొన్నారు.
గట్టు పైకి వెళ్లిన పార్వతీదేవి
నార్కట్‌పల్లి : భోగి పండుగ సందర్భంగా మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గట్టు కింద గల పార్వతీదేవి అమ్మవారిని సోమవారం సాయంత్రం గట్టుపైకి తీసుకెళ్లారు. ఏటా వార్షిక బ్రహ్మత్సవాలకు (భోగి పండుగ రోజు) ముందు అమ్మవారిని గట్టు పైకి తీసుకెళ్లి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం అమ్మవారిని కిందకు తీసుకురావడం ఆనవాయితి. ఈ సందర్భంగా పార్వతీదేవి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దేవాలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేఽశ్వర శర్మ, సురేస్‌శర్మ, సతీష్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ, నాగయ్యశర్మ అర్చక బృందం ప్రత్యేక పూజలు చేశారు.
మట్టపల్లిలో కల్యాణ మహోత్సవాలు
మఠంపల్లి: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం మట్టపల్లి క్షేత్రంలో శ్రీగోదాదేవి రంగనాయకుల స్వామి కల్యాణ మహోత్సవాన్ని శ్రీమాన్ బదరీనారాయణాచార్యులు పర్యవేక్షణలో అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, తిరుప్పావై సేవాకాలం, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భోగి పండుగను పురస్కరించుకుని శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. ఆ తర్వాత కల్యాణతంతు పూర్తి చేశారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment