అమృత్ 2 కింద రూ.216 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను చేపట్టాం. 180 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉండగా, మా హయాంలో ఇప్పటివరకు 66 కిలోమీటర్లు పూర్తి చేశాం. 14 వార్డుల్లోని 20 ప్రాంతాల్లో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గతంలో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీని ఇళ్లకు అనుసంధానం చేశాం.
నిత్యం నీటి సరఫరాకు ట్యాంకులు
పట్టణంలో నిత్యం మంచినీరు సరఫరా చేయాలన్నది మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లక్ష్యం. అందులో భాగంగా రూ.56 కోట్లతో ట్యాంకుల నిర్మాణం చేపట్టాం. 9 వార్డుల్లో 6 లక్షల నుంచి 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకులను నిర్మిస్తున్నాం. 1, 6, 19 వార్డుల్లో వాటర్ ట్యాంకుల పనులు ప్రారంభించబోతున్నాం. ఆ ట్యాంకులకు ఉదయ సముద్రం నుంచి నీటిని సరఫరా చేసేందుకుగాను.. పానగల్ వద్ద 70 ఎంఎల్‌డీ ప్లాంట్ నిర్మాణానికి రూ.96 కోట్లతో డీపీఆర్ రూపొందించి ప్రభుత్వానికి పంపించాం. ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా 6 మోటార్ల కొనుగోలుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎస్‌డీఎఫ్ నిధులు ఇచ్చారు. మున్సిపాలిటీలో 5 ట్రాక్టర్లు, 8 ఆటోలను కొనుగోలు చేసి శానిటేషన్ మెరుగుపర్చాం.
రూ.109 కోట్లతో వరద కాల్వలు..
పట్టణంలో రూ.109 కోట్లతో వరద కాల్వల పనులు చేపట్టాం. పట్టణంలో రూ. 54 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టాం. రూ.538 కోట్లతో మంత్రి బైపాస్ రోడ్డును మంజూరు చేయించారు. సెయింట్ ఆల్ఫోన్సెస్ స్కూల్ వద్ద ఎలివేటర్ లిఫ్ట్‌ను పెట్టబోతున్నాం. లతీఫ్‌సాహెబ్ గుట్ట, బ్రహ్మంగారిగుట్టలకు లెఫ్ట్, రైట్‌లో రూ.140 కోట్లు, ఘాట్ రోడ్లను ఏర్పాటు చేయబోతున్నాం. రూ. 96 కోట్లతో నీలగిరి నిలయం భవనం నిర్మాణానికి చర్యలు చేపడతాం.
విద్యా, ఉపాధిపై ప్రత్యేక దృష్టి
విద్యా, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టితో పని చేస్తున్నాం. 75 ఏళ్లుగా బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనం లేదు. దానికోసం ప్రకాశంబజార్‌లో రూ.3 కోట్లతో చేపట్టిన భవన నిర్మాణం వేగంగా సాగుతోంది. రామగిరిలోని రామాలయానికి అనుకుని ఉన్న భూమిని మంత్రి రూ.50 లక్షలతో కొనుగోలు చేసి దేవాలయానికి ఇచ్చారు. పట్టణంలోని ఐటీఐలో రూ.20 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ భవనం, మరో రూ.10 కోట్లతో సాంకేతిక అభివృద్ధి భవన నిర్మాణం చేపట్టాం.
Comments
Please login to add a commentAdd a comment