రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని రామగిరి సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం రాత్రి గోదాదేవి రంగనాథస్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సబిత దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి మంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, భవేష్‌శర్మ దంపతులు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి దంపతులు, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి, ఆలయ ఈఓ జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment