కులదైవానికి ‘భోగి’ బోనాలు
మోత్కూరు : మోత్కూరు పట్టణంలో ముదిరాజ్, గౌడ కులస్తులు భోగి పండుగను వినూత్నంగా నిర్వహించారు. భోగి పండుగ రోజు తమ కులదైవాలకు బోనాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. కాగా ముదిరాజ్ కులస్తులు పెద్ద తల్లి ఆలయానికి, గౌడ కులస్తులు కంఠ మహేశ్వర స్వామి ఆలయానికి బోనాలతో ప్రదర్శనగా వెళ్లారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి దేవతలకు బోనంను నైవేద్యంగా సమర్పించారు. శివసత్తుల పూణకాలు, డప్పుచప్పుళ్లు మధ్య బోనాలు వేడుకలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సొసైటీ అధ్యక్షులు మన్నె భీమయ్య, ఉపాధ్యక్షుడు మొలకల రమేష్, కార్యదర్శి కోమటి మత్స్యగిరి, యూత్ విభాగం ప్రతినిధులు కోమటి జనార్దన్, బుంగపట్ల మత్స్యగిరి, బండారు చిరంజీవి, కోమటి అజయ్‌కుమార్, బొల్లేపల్లి వీరేష్, గౌడ సొసైటీ నాయకులు బుర్ర యాదయ్య, బీసు యాదగిరి, కారుపోతుల వెంకన్న, మొరిగాల వెంకన్న, బీసు మధు, గునగంటి శ్రీధర్, బుర్ర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment