‘భరోసా’కు భూ సర్వే.!
పట్టాదారు పాస్ పుస్తకాల
ఆధారంగా సర్వే..
తహసీల్దార్లు, వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో భూముల సర్వేను నిర్వహిస్తారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బృందంగా ఏర్పడి సర్వే చేస్తారు. ఆయా గ్రామాల్లోని ఆర్‌ఓఆర్ పట్టాదారు పాస్ పుస్తకాల జాబితాను ధరణి పోర్టల్ నుంచి ప్రింట్ తీసుకుని, గ్రామ మ్యాప్, గూగుల్ మ్యాప్‌లతో పోలుస్తూ గ్రామాన్ని సందర్శించి వ్యవసాయ సాగు యోగ్యం కాని భూముల జాబితాను రూపొందిస్తారు. ఆ భూముల జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించి, చదివి వినిపించి చర్చించిన ఆమోదం తీసుకుంటారు. అనంతరం గ్రామాల వారీగా సాగుకు యోగ్యం కాని భూముల పట్టికను పోర్టల్‌లో నమోదు చేసి డిజిటల్ సంతకం చేస్తారు. 25న ఈ జాబితాలను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. వాటి ఆధారంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను తొలగించి మిగిలిన భూములకు రైతు భరోసా సాయాన్ని 26న ప్రభుత్వం విడుదల చేయనుంది.
3నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు కోసం కసరత్తు ప్రారంభించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేల చొప్పున ఇస్తామని.. ఈ నెల 26 నుంచి రైతు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన విధి విధానాలను ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సాగుకు యోగ్యం కాని భూములకు భరోసా ఇవ్వబోమనే స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు గాను ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. సాగు చేయని భూముల జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని పేర్కొంది. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి ఆమోదం తీసుకోవాలని సూచించింది. అనంతరం ఈ నెల 26 నుంచి రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 140 బృందాలను జిల్లా యంత్రాంగం నియమించింది.
సాగుకు యోగ్యం
కాని భూములు ఇలా..
ఇళ్ల నిర్మాణం జరిగిన, కాలనీలుగా మారిన, ఇళ్ల స్థలాలు, రాళ్లు రప్పలు, గుట్టలతో నిండిన భూములు, స్థిరాస్తి లేఅవుట్లు, రోడ్లుగా మారినవి, పరిశ్రమలు నిర్మించినవి, గోదాములు, గనులకు వినియోగిస్తున్న భూములు, ప్రభుత్వం వివిధ పథకాలకు సేకరించిన అన్ని రకాల భూములు సాగుకు యోగ్యం కాని వాటిగా గుర్తిస్తారు.
ఫ 16 నుంచి 20 వరకు సాగుకు
యోగ్యం కాని భూముల గుర్తింపు
ఫ 140 బృందాలను ఏర్పాటు
చేసిన యంత్రాంగం
ఫ గ్రామసభ ఆమోదం అనంతరం
ప్రభుత్వానికి జాబితా
ఫ 26 నుంచి రైతు భరోసా జమ
చేయనున్న ప్రభుత్వం
సాగు చేసే భూములకే భరోసా వస్తుంది
రైతు భరోసా పథకాన్ని ఈ నెల 26 నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. సాగుకు యోగ్యం కాని భూములను రైతు భరోసా పథకం నుంచి తొలగించనుంది. సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల వారీగా సర్వే నిర్వహించనున్నాం. సర్వేలో సాగుకు యోగ్యం కాని భూములను గుర్తిస్తాం. ప్రభుత్వం సాగు చేసే భూములకే రైతు భరోసా జమ చేయనుంది.
– శ్రవణ్‌కుమార్, డీఏఓ, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment