చివ్వెంల: రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదైన దురాజ్‌పల్లి శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఆలయ నూతన కమిటీ సభ్యులను నియమించినట్టు దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులుగా సూర్యాపేటకు చెందిన సీనియర్ న్యాయవాది పోలెబోయిన నర్సయ్య యాదవ్, పోలెబోయిన నరేష్ పిళ్లే, వట్టిఖమ్మంపహాడ్ గ్రామానికి చెందిన వీరబోయిన సైదులు యాదవ్, సూర్యాపేట మండలం కేసారానికి చెందిన మెంతబోయిన లింగస్వామి, మెంతబోయిన చిన్న మల్లయ్య, ఖాసీంపేటకు చెందిన సిరపంగి సైదమ్మ నియమితులయ్యారని పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ వద్ద సమావేశం నిర్వహించి చైర్మన్ ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment