ఫ నేటి నుంచి జాన్‌పహాడ్ ఉర్సు
దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : భారతీయ వాయుసేన.. అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు మెడికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిప్లొమో, బీఎస్సీ ఫార్మసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు ఈ నెల 24న నల్లగొండలోని ఎన్జీ కాలేజిలో జరగనున్న అవేర్‌నెస్ కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.
24న విద్యుత్ గ్రీవెన్స్‌డే
నల్లగొండ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న నల్లగొండ బస్టాండ్ సమీపంలోని విద్యుత్ పర్యవేక్షణ అధికారి కార్యాలయంలో విద్యుత్ గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వినియోగదారులు వారి ఆధార్‌కార్డు, కరెంట్ బిల్లు రసీదు తీసుకురావాలని సూచించారు.
విద్యుత్ సరఫరాలో
అంతరాయం కలగొద్దు
నల్లగొండ : ఎండాకాలంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని.. కరెంట్ కోతలతో రైతులు రోడ్డెక్కితే డీఈ, ఎస్‌ఈలే వహించాల్సి ఉంటుందని టీజీఎస్‌పీడీసీఎల్ కమర్షియల్ సీఈ పి.భిక్షపతి అన్నారు. బుధవారం నల్లగొండ ఎస్‌ఈ కార్యాలయంలో ఏడీఈలు, డీఈలు, ఎస్‌ఈలతో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11కేవీ, 33కేవీ, ఫీడర్లు, పీటీఆర్‌లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. సమ్మర్‌లో పంట పొలాలు కోతలు ఉంటాయని.. రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. అవసరమైన మెటీరియల్ వెంటనే తెప్పించుకుని బిగించాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డీఈలు, ఏడీఈలు పాల్గొన్నారు.
ఫ టీజీఎస్‌పీడీసీఎల్ సీఈ భిక్షపతి
Comments
Please login to add a commentAdd a comment