డిజిటల్ అరెస్టుల పేరిట మోసాలు..
డిజిటల్ అరెస్టుల పేరుతోనూ మోసాలు చేస్తున్నారు. తాము కస్టమ్స్, బీబీఐ, సీఐడీ, ఏసీబీ అధికారులమని, మీరు అక్రమంగా సంపాదిస్తున్నారని చెప్పి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ ఒకరు ఫోన్‌లో చెబుతారు. ఆ పక్కనే మరో మోసగాడు ఆయన అలాంటి వారు కాదు సర్.. మీరు ఆగండి నేను మాట్లాడతాను.. అంటూ బాధితుడికి ఫోన్ చేస్తారు. మీరు డబ్బు పంపితే మిమ్మల్ని అరెస్టు చేయకుండా చూస్తానని, లేదంటే మీ ఇష్టం అంటూ బెదిరిస్తుండటంతో అమాయకులు రూ.లక్షలు కోల్పోతున్నారు. మిర్యాలగూడలో ఓ డాక్టర్ ఇలాగే భారీ మొత్తంలో డబ్బును కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment