ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలి
నకిరేకల్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నకిరేకల్ మండలం ఓగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారంథామె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగుల వివరాలు, అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ రిజిస్టర్లను పరీశింలించారు. గర్భిణులకు ప్రతి నెలా చికిత్సలు అందించే ఏఎన్‌సీ రిజిస్టర్లను తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో జీరో డెలవరీలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. డాక్టర్లు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారా.. లేదా అని ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు ఎక్కువగా వస్తారని వారికి సరైన వైద సేవలందించాలని సూచించారు. ఎలాంటి సమస్య లేకున్నా.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులను కావాలని ప్రైవేట్ ఆస్పత్రులకు పంపినట్లు తమ దృష్టికి వస్తే ప్రభుత్వ డాక్టర్లు వైద్య సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఆమె వెంట తహసీల్దార్ జమీరుద్దీన్, మండల వైద్యాదికారి యోగస్వీ, నర్సింహాచారి ఉన్నారు.
బోగస్ జాబితాలను నమ్మొద్దు
నల్లగొండ : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితా అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న బోగస్ జాబితాలను ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రభుత్వం తరఫున ఇప్పటివరకు ఎలాంటి అనుమతి పొందిన జాబితాలు విడుదల చేయలేదని పేర్కొన్నారు. మండల స్థాయిలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా స్థాయిలో కలెక్టర్ చెప్పిన, అనుమతించిన జాబితాలను మాత్రమే ప్రజలు నమ్మాలని సూచించారు. ఆయా పథకాల కింద ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు మాత్రమే చదువుతున్నామని తెలిపారు. ఇవి ప్రభుత్వం ఆమోదించిన, తుది జాబితాలు కావని తెలిపారు. దరఖాస్తులు, కుటుంబ సర్వే ఆధారంగా అర్హత జాబితాను తయారు చేస్తామని తెలిపారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
221 గ్రామసభలు, 47 వార్డు సభలు
నల్లగొండ : ప్రజాపాలన గ్రామసభల నిర్వహణలో భాగంగా బుధవారం జిల్లాలో 221 గ్రామసభలు, 47 మున్సిపల్ వార్డుసభలు నిర్వహించినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళ, బుధవారాల్లో మొత్తం 444 గ్రామసభలు, 95 మున్సిపల్ వార్డు సభలను నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం రేషన్‌కార్డుల కోసం 13,921, ఇందిరమ్మ ఇళ్ల కోసం 12,227, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 346, రైతు భరోసా కింద 288 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment