మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
నల్లగొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డిని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి లేదన్నారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయాల్సి ఉండగా.. బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం గుండాలు, గంజాయి బ్యాచ్‌తో మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌కు వెళ్లి దౌర్జన్యం చేశారని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశాడని, జాతీయ రహదారి ఆరు లైన్లుగా విస్తరణ పనులు మంజూరు చేయించిన ఘనత కూడా ఆయనదేనని అన్నారు. పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న జగదీష్‌రెడ్డి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి కోమటిరెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయించారని చెప్పారు. అభివృద్ధికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్స్ అని వారు స్పష్టం చేశారు. నల్లగొండ మున్సిపాలిటీలోని 16 వార్డులలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు జరుగుతున్నాయని, మంత్రి కోమటిరెడ్డి నల్లగొండ నియోజకవర్గంలో 8 సబ్ స్టేషన్లు మంజూరు చేయించి పనులు చేపట్టారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసమే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆ పార్టీ నాయకుల మెప్పుపొందాలని చూస్తున్నాడని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డిపై ఆరోపణలు చేస్తే ఇక చూస్తూ ఊరుకోమని, తమదైన శైలిలో గుణపాఠం చెబుతామన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్లగొండ, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య, పాశం రాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, కౌన్సిలర్లు బషీరుద్దీన్, మారగోని నవీన్‌గౌడ్, కేసాని వేణుగోపాల్‌రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, గణేష్ శ్రీనివాస్‌రెడ్డి, జూలకంటి సైదిరెడ్డి, గోవర్దనాచారి, వజ్జ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కోమటిరెడ్డి బ్రదర్స్ అభివృద్ధికి
బ్రాండ్ అంబాసిడర్స్
ఫ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
భాష మార్చుకోవాలి
ఫ అధికారంలో ఉన్నప్పుడు జగదీష్‌రెడ్డి చేసింది ఏమీలేదు
ఫ కాంగ్రెస్ నాయకులు గుమ్మల
మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment