అద్దె అకౌంట్ల ద్వారా మోసం..
నల్లగొండ, హాలియా, మిర్యాలగూడ ప్రాంతాల్లో అద్దె అకౌంట్ల మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మీకు లోన్ మంజూరైంది ఫలానా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయండి.. మీకు రూ.10 వేలు వస్తాయి.. మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో ఆశతో కొందరు అకౌంట్లు ఓపెన్ చేస్తు్‌ాన్నరు. ఈ క్రమంలో తమ ఫోన్ నంబర్ ఆధారంగానే అకౌంట్ ఓపెన్ చేసినా, సైబర్ నేరగాళ్ల మాయమాటలు విని ఆన్‌లైన్ అకౌంట్‌కు, ఎస్‌ఎంఎస్ ఆప్షన్‌కు సైబర్ నేరగాళ్ల ఫోన్ నంబర్‌ను ఇచ్చేస్తున్నారు. ఇలాంటి అకౌంట్లకే తాము మోసం చేసి రాబట్టుకున్న డబ్బును తరలించి విత్ డ్రా చేస్తున్నారు. అంతేకాదు డాట్ ఏపీకే ఫైల్స్ పంపి దానిని ఓపెన్‌చేసి ఫోన్ హ్యాక్ చేసి అకౌంట్లలో డబ్బును కాజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment