తగ్గుతున్న శ్రీశైలండ్యాం నీటి మట్టం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలండ్యాం నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ జూరాల, సుంకేసు ల నుంచి నీటి విడుదల పూర్తిగా నిలిచిపోవడం, శ్రీశైలం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు నీటి వి డుదల కొనసాగుతుండడంతో నీటి మట్టం త గ్గుతోంది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 4,350 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 27,496 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. కుడిగట్టు కేంద్రంలో 0.146, ఎడమగట్టు కేంద్రంలో 6.449 మిలియన్ యూ నిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జలాశయంలో 169.8650 టీఎంసీల నీరు ఉంది. డ్యాం నీటి మట్టం 876.30 అడుగులకు చేరుకుంది.
అక్రమాలకు పాల్పడితే
కఠిన చర్యలు
మహానంది: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.జనార్దన్‌రావు హెచ్చరించారు. బుక్కాపురంలోని వెలుగు కార్యాలయం వద్ద మంగళవారం సామాజిక తనిఖీ ప్రజా వేదికలో నిర్వహించారు. రూ.6,17,90,411 విలువైన 878 పనులకు గ్రామస్థాయిలో సోషల్ ఆడిట్‌పై బహిరంగ సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ వివిధ గ్రామాల్లో ఆరోపించిన పనుల్లో భాగంగా రూ.29,121 రికవరికీ ఆదేశించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి, ఏపీడీ బాలాజీ నాయక్, విజిలెన్స్ అధికారి షీబారాణి, ఎంపీడీఓ మహమ్మద్ దౌలా, ఏపీఓ మనోహర్ పాల్గొన్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి టోకరా
డోన్ టౌన్: స్థానిక శ్రీరామ్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శిరీషకు సైబర్ నేరగాళ్లు టోకరా పెట్టారు. విదేశాల నుంచి వచ్చిన పార్శిల్‌లో నిషేఽ దిత వస్తువులు, మత్తు పదార్థాలు ఉన్నాయని, మీరు ఆర్డర్ చేయకపోతే ఆన్‌లైన్ కంప్లైంట్ ఇవ్వా లని మాటల్లో దింపి చాకచక్యంగా ఆమె అకౌంట్‌లో నుంచి రూ.3.60 లక్షలు కాజేశారు. బాధితురాలు తెలిపిన వివరాలు..మంగళవారం ఉద యం శిరీష సెల్ ఫోన్‌కు అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాము ముంబయి నుంచి పోలీసులం మాట్లాడు తున్నామని, మీకు విదేశాల నుంచి ఫెడెక్స్ కొరియర్ నుంచి పార్శిల్ వచ్చిందని, అందులో కొన్ని నిషేధిత వస్తువులు, మత్తు పదార్థాలతోపాటు నకిలీ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని భయపెట్టాడు. పార్శిల్ పంపిన నేరగాళ్ల ఫొటోలతోపాటు లెటర్లు ఇవేనని వాట్సాప్‌కు పంపారు. వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి వస్తువులు బుక్ చేయలేదని వివరణ ఇవ్వగా, అకౌంట్ నుంచి కూడా వేరే పది ఖాతాలకు మనీలాండరింగ్ జరిగిందని పూర్తి వివరాలు తెలియజేస్తే విచారిస్తామని చెప్పి ఆధార్‌కార్డు, బ్యాంక్ వివరాలు తె లుసుకున్నారు. ముంబయికి వచ్చి ఫిర్యాదు చేయాలని లేక పోతే నిందితులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానించాల్సి ఉంటుందని హెచ్చ రించారు. ఇందుకు బాధితురాలు ముంబయికి రాలేమని చెప్పగా.. ఒక లింక్ పంపి అది ఓపెన్ చేసి పూర్తి వివరాలు నింపి ఆన్‌లైన్ కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు. ఇందుకు ఆమె వివరాలు నమోదు చేయడంతో ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి అందులో ఉన్న రూ.1.10 లక్షలు మళ్లించుకోవడంతోపాటు, రూ.2.50 లక్షల ప్రీ అప్రూవ్‌డ్‌లోన్ మంజూరు చేయించి వాటిని కూడా బదలాయించుకున్నారు. తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిన విషయం తెలుసుకుని బ్యాంక్ అధికారులను సంప్రదించగా వారు 9130 కంప్లైంట్ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment