ప్రసవాల సంఖ్య పెంచాలి
పాణ్యం: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెరగాలని కలెక్టర్ రాజకుమారి గనియా అన్నారు. బుధవారం ఆమె మద్దూరు పీహెచ్‌సీని తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. మందులు, వాటికి సంబంధించిన రికార్డులు చూసి పనితీరు మార్చుకోవాలని సిబ్బందికి సూచించారు. ఔషధాలకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్ చూపకపోవడంతో ఫార్మసిస్ట్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. అనంతరం ఆమె ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకున్నారు.
సహకార వారోత్సవాలను
విజయవంతం చేయండి
నంద్యాల: వికసిత్ భారత నిర్మాణంలో భాగంగా జిల్లాలో ఈనెల14 నుంచి 20 వరకు జరిగే అఖిలభారత సహకార వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి సహకార శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె తన చాంబర్‌లో జిల్లా సహకార అధికారి వెంకటసుబ్బయ్య, డ్వామా డీపీ జనార్దన్ రెడ్డితో కలిసి సహకార వారోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వివిధ రంగాల్లో సహకార సంఘాల అభివృద్ధి, వాటి విజయ గాథలను తెలియపరచాలన్నారు. గురువారం సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఎలా అనే అంశంపై చర్చా కార్యక్రమాలు నిర్వహంచాలని ఆదేశించారు.
మద్దూరు పీహెచ్‌సీ తనిఖీలో కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment