వారికి తీవ్ర నిరాశే...
ఉద్యోగులు సర్వీస్ పూర్తి చేసుకుని బెనిఫిట్స్‌తో పాటు పెన్షన్ కోసం ప్రపోజల్ పంపాడాన్ని సర్వీస్ పెన్షన్‌గా వ్యవహరిస్తారు. పదవీ విరమణ తర్వాత సంబంధిత శాఖ ద్వారా సర్వీస్ పెన్షన్ ప్రపోజల్స్ ఏజీ కార్యాలయానికి వెళ్తాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో సర్వీస్ పెన్షన్ ప్రపోజల్స్‌ను ఆమోదించే ప్రక్రియ కేవలం 45 రోజుల్లోనే జరిగేది. 90 రోజుల్లోపు బెనిఫిట్స్ చేతికి రావడంతో పాటు పెన్షన్ కూడా మంజూరు అయ్యేది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సర్వీస్ పెన్షన్ ప్రపోజల్స్ ఆమోదించే వ్యవధిని 45 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది. దీని ప్రకారం పదవీ విరమణ పొందిన వారు బెనిఫిట్స్, పెన్షన్ పొందడానికి 10 నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో పదవీ విరమణకు చేరువలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆందోళన పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment