ప్రతి నెలా 200 నుంచి 300 మంది పదవీ విమరణ
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు దాదాపు 65 వేల మంది ఉన్నారు. వీరిలో ప్రతి నెల 200 నుంచి 300 మంది పదవీ విరమణ చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అంటే జూన్ నుంచి అక్టోబరు వరకు కర్నూలు జిల్లాలో 600 మంది, నంద్యాల జిల్లాలో 400 మంది వరకు పదవీ విరమణ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పదవీ విరమణ చేసిన వారిలో ఒక్కరికీ కూడా పదవీ విరమణ ప్రయోజనాలు లభించలేదు. నవంబరు, డిసెంబరు నెలల్లో మరో 400 మంది వరకు పదవీ విరమణ చేయనున్నారు. వీరికి 2026లోనే బెనిఫిట్స్, పెన్షన్ లభించే అవకాశం ఉంది. పెన్షన్ ప్రతిపాదనలను ఆమోదించడానికి గడువును రెట్టింపు చేయడమే ఇందుకు కారణం.
గడువు పెంచడం సరికాదు
ఫ్యామిలీ పెన్షన్, సర్వీస్ పెన్షన్ ప్రతిపాదనలను ఆమోదించేందుకు గడువును రెట్టింపు చేయడం అన్యాయం. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఏడాది వరకు ప్రయోజనాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపోజల్స్ ఎక్కువగా ఉన్నపుడు సకాలంలో ఆమోదించేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలి గానీ, ఇలా గడువును పెంచడం సరికాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి గతంలో ఉన్నట్లు గానే సర్వీస్ పెన్షన్ ప్రపోజల్స్‌ను 45 రోజుల్లోపు, ఫ్యామిలీ పెన్షన్ ప్రపోజ్స్‌ను 90 రోజుల్లోపు ఆమోదించాలి.
–జి. హృదయరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీటీఎఫ్
Comments
Please login to add a commentAdd a comment