ప్రియవర్దిని..నాట్యమర్దిని
కర్నూలు కల్చరల్: కూచిపూడి నృత్యం, సంగీతం, కరాటే, చిత్రలేఖనంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ బహు ముఖ ప్రజ్ఞాశాలిగా ప్రశంసలు అందుకుంటోంది కర్నూలుకు చెందిన ప్రియవర్థిని పాకరాల. ప్రియవర్దినిని ఎనిమిదేళ్ల వయసు నుంచే తల్లిదండ్రులు కె.నరసింహుడు (సివిల్ ఇంజినీర్), కె.శివమ్మ (గృహిణి) నాట్య గురువు నాగసాయి ప్రదీప్ వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇప్పించారు. 2014లో ప్రారంభమైనా ఇప్పటికీ కొనసాగుతోంది. కర్నూలులోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఈమె గడిచిన పదేళ్లలో కర్నూలు నగరంతోపాటు శ్రీశైలం, లేపాక్షి, మంత్రాలయం, తిరుచానూరు, విజయవా డ, విశాఖపట్టణం, మంత్రాలయం, అలంపూరు, హైదరాబాదు, కాణిపాకం, కడప, ప్రొద్దుటూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకుంది. 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన సిలికానాంధ్ర వారి కూచిపూడి సమ్మేళనంలో పాల్గొంది. అలాగే తైక్వాండో మార్షల్ ఆర్ట్స్‌లోనూ బ్లాక్ బెల్ట్ పొందింది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లో పలు కంపిటీషన్స్‌లో పాల్గొని విజేతగా నిలిచింది. అబాకస్, సంగీతంలోనూ ప్రతిభ కనబరుస్తోంది. యంగ్‌మూడోలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం కై వసం చేసుకుంది. భవిష్యత్తులో మంచి నృత్య శిక్షకురాలిగా రాణించాలనిదే తన ధ్యేయమని ప్రియవ ర్దిని చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment