చేపల ఉత్పత్తి పెంపుదలకు కృషి
నంద్యాల: జిల్లాలో చేపల ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవం కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 124 చెరువులు, ఐదు రిజర్వాయర్లలో 50 వేల మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి జరుగుతుందన్నారు. అయితే, ఈఉత్పత్తి మరింత పెంచేందుకు ఉన్నత ప్రమాణాలతో నివేదికలు సమర్పిస్తే నాబార్డుతో అనుసంధానం చేస్తామన్నారు. చికెన్, మటన్ కంటే ఆరోగ్యానికి చేపలు మేలని ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మత్స్యకార సంఘ నాయకులు ఈ దిశగా పనిచేయాలన్నారు. చేపల ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కృషి చేయాలన్నారు. రకరకాల చేపల వంటకాలు చేసి వాటికి మార్కెటింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో 71 మత్స్యశాఖ సొసైటీలున్నాయని, వాటిలోని సభ్యులందరికీ చేపల ఉత్పత్తి, వంటకాలపై నైపుణ్యం పెంచి వారి జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలన్నారు. చేపల ఉత్పత్తి నిల్వలకు అవసరమయ్యే కోల్డ్ స్టోరేజ్‌లను నాబార్డ్ సహాయంతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా మత్స్యశాఖ జేడీ రాఘవరెడ్డి, బేస్త కుల సంఘ సభ్యులు, మత్స్యకారుల సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి
పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసి ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి 35 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రగతిపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 1023 సీసీ రోడ్ల నిర్మాణాలకు గాను 842 గ్రౌండింగ్ కాగా 132 పూర్తి చేశామన్నారు. ఇందులో వచ్చే వారానికి ప్రగతి కనపడాలన్నారు. సంక్రాంతి పండుగలోపు అన్ని సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈలు నాగరాజు, రఘురామిరెడ్డి, డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
కిశోర బాలికల భవిష్యత్తుకు
బాటలు వేయండి
నంద్యాల(అర్బన్): కిశోర వికాస కార్యక్రమం కింద బాలికల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్‌జీఓ కాలనీలో కోపరేటివ్ ఫంక్షన్ హాల్‌లో కిశోర వికాస కార్యక్రమం కింద క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి జిల్లాస్థాయి శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టడంలో సీ్త్ర శిశు సంక్షేమం, వైద్య, పంచాయతీ, సచివాలయ వ్యవస్థలు వెనుకబడి ఉన్నాయన్నారు. బాల్య వివాహాల నియంత్రణలో రాష్ట్రంలో నంద్యాల జిల్లాను రెడ్ మార్క్ చూపించడం బాధాకరమన్నారు. అధికారులు, సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు. యుక్త వయస్సులో ఉండే అమ్మాయిలు ఉన్నత విద్య అభ్యసింపజేసేలా వారి తల్లిదండ్రులను చైతన్యం చేయాలన్నారు.
నాబార్డ్ సహాయంతో
కోల్డ్‌స్టోరేజ్‌ల నిర్మాణం
ప్రపంచ మత్స్య దినోత్సవంలో
జిల్లా కలెక్టర్ రాజకుమారి
Comments
Please login to add a commentAdd a comment