తీరని ద్రోహం
ఒక రేషన్ షాపునే ఒక వీధిలో నుంచి మరో వీధిలోకి మారుస్తామంటే ఒప్పుకోరు. అలాంటిది ఏకంగా రాజధానిని ‘సీమ’ త్యాగం చేసింది. హైకోర్టు బెంచ్ కాదు ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేయాలి. హైకోర్టును నిర్మించాలి. శ్రీబాగ్ ఒప్పందం ఇదే! వేర్పాటు వాదం రాగానే బెల్గాంలో అసెంబ్లీ నిర్మించారు. శీతాకాల సమావేశాలు అక్కడ జరుగుతున్నాయి. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు వైజాగ్‌లో విశ్వవిద్యాలయం, కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు నిర్మించాలని నిర్ణయించారు. ‘సీమ’ అవసరాలు తీరిన తర్వాతే కృష్ణా జలాలను ఇతర ప్రాంతాలు వినియోగించుకోవాలని చెప్పారు. ఇందులో ఏ ఒక్కటీ అమలు కాలేదు. ఏడు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. మా ప్రభుత్వం అధికారంలో ఉండగా హైకోర్టు నిర్మించేందుకు సిద్ధమైతే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బెంచ్ ఏర్పాటు అంటూ తీరని ద్రోహం చేస్తోంది.
– బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి
ఏకపక్ష నిర్ణయాలతో
మళ్లీ విబేధాలు
విభజన తర్వాత రాజధాని ప్రకటన సమయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా అమరావతిని ఏకపక్షంగా ప్రకటించారు. రాజధాని, హైకోర్టు రెండింటిలో ఒకటి సీమలో ఏర్పాటు చేయాలని గతంలో ఒప్పందం జరిగింది. రాజధానిని అమరావతిలో పెడుతున్నారు. మరి హైకోర్టును కర్నూలులో పెట్టకపోవడం దారుణం. బెంచ్ ఏర్పాటు చేయడమంటే ‘సీమ’కు ప్రత్యక్షంగా ద్రోహం చేయడమే. రాజధాని, హైకోర్టు ఏర్పాటుపై మరోసారి చర్చ జరగాలి. ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలతో ప్రాంతీయ విభేదాలు తలెత్తి మళ్లీ వేర్పాటువాదం బలపడే ప్రమాదం ఉంది. – శైలజానాథ్, మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment