కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి | Sakshi
Sakshi News home page

కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

Published Mon, May 6 2024 2:00 AM

కార్మికులకు కనీస  వేతనం అమలు చేయాలి

నర్వ: బీడి కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు అమలు చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం నర్వ, లంకాల్‌ బీడీ ఫ్యాక్టరీల వద్ద కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. గత మూడు దఫాలుగా బీడీ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో ప్రస్తుతం వెయ్యి బీడీలకు అందిస్తున్న రూ.207కు మరో రూ.10మాత్రమే యాజమాన్యాలు పెంచుతామనడం అన్యాయమన్నారు. కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్న యాజమాన్యాలు వేతన పెంపును పునారాలోచించాలన్నారు. దీంతో పాటు పీఎఫ్‌ వాటా 50 శాతం జమచేయాలని, గ్రాట్యుటీ చట్ట ప్రకారం అమలు చేయాలని, పీఎఫ్‌లో ఉన్న తప్పొప్పులను వెంటనే సవరించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో బీడీ వర్కర్స్‌ యూనియన్‌ వనసర్తి జిల్లా సహాయ కార్యదర్శి రాజు, నాయకులు మన్యం, తిరుపతమ్మ, కృష్ణమ్మ, వెంకటమ్మ, చెన్నమ్మ, భాగ్య, మరియమ్మ, తదితరులు పాల్గొన్నారు.

అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి

నారాయణపేట రూరల్‌: జిల్లాలో వరుస చోరీల నేపథ్యంలో ప్రజలు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కలిసిరావాలని, మీ చుట్టు పక్కల ఎవరైన కొత్త వ్యక్తులు, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయి పెట్రోలింగ్‌ జరగుతుందని, ప్రత్యేక పోలీసు బృందాలు మఫ్తీలో గస్తీ చేపడుతున్నారని, వేసవి దృష్ట్యా బంధువుల ఇళ్లకు, విహారయాత్రలకు వెళ్లే సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు, నగదు ఉంచకుండా బ్యాంకు లాకర్లలో దాచుకోవాలని సూచించారు. తాళం వేసిన ఇళ్లను దొంగలు లక్ష్యం చేసే అవకాశం ఉన్నందున పక్కింటి వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వీలైనంత వరకు కాలనీ కమిటీలు, వ్యాపార సముదాయాల వారు సహకరించి సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని తెలిపారు.

మహిళల అభ్యున్నతికి పెద్ద పీట

నారాయణపేట: దేశంలోనే అన్ని రంగాల్లో మహిళలకు 33 శాతంతో పార్లమెంట్‌లో బిల్లు పెట్టి మహిళల అభ్యున్నతికి పెద్ద పీఠ వేసింది మోదీ ప్రభుత్వం అని ఆ పార్టీ మహిళా మోర్చ అధ్యక్షురాలు లక్షిచ్మ అన్నారు. ఆదివారం మండలంలోని లింగంపల్లిలో పాలమూరు పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి డికే అరుణ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పేద మహిళలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లతోపాటు మరుగుదొడ్లు, రేషన్‌ బియ్యం మంజూరు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని వివరించారు. దేశామంత మరో సారి మోదీని పీఎం చేయాలనే చూస్తుందని, ఈ ఎన్నికల్లో హాట్రిక్‌ పీఎం మోదీ ఖావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఽఈ ప్రాంతానికి చెందిన ధన్వాడ ఆడబిడ్డ అరుణను గెలిపించాలని, ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. గ్రామ శివారులో ఉపాధి పనుల్లోని మహిళ కూలీలకు మజ్జిగ అందజేశారు. సుజాత, భీంష న్‌ జోషి. రాందాస్‌ నాయక్‌, కృష్ణ, ఎన్‌ ఎల్లప్ప, రాజు. విజయ్‌. వెంకటేష్‌. ఎల్లాగౌడ్‌. కార్యకర్తలు మహిళ లు పాల్గొన్నారు.

మరోసారి

బీజేపీదే అధికారం

కల్వకుర్తి రూరల్‌: దేశంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం కల్వకుర్తిలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్‌తో కలిసి కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట శక్తికేంద్ర ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్‌ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌లో భరత్‌ ప్రసాద్‌ విజయం ఖాయమన్నారు. శక్తి కేంద్ర ఇన్‌చార్జ్‌లకు అప్పగించిన బాధ్యతలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తమ పరిధిలోకి వచ్చే ప్రతి ఓటరును కలిసి ఈ పదేళ్లలో కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించి ఓట్లు అడగాలన్నారు. ప్రతి కార్యకర్త ఎన్నికల వరకు కష్టపడి పనిచేసి బీజేపీ విజయం కోసం శ్రమించాలని సంతోష్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి, బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement