ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

Published Tue, May 7 2024 5:30 AM

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

నారాయణపేట: లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. ఎన్నికల్లో పీఓలు, ఏపీఓలు సహాయ పీఓ, ఓపీఓలకు ఎన్నికల నిర్వహణ, ఈవీఎంలపై జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు పోలింగ్‌ రోజున పాటించాల్సిన బాధ్యతలు, చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్‌ అవగాహన కల్పించారు. అందరూ ఫారం 12ఏ ఇవ్వాలని, 17సి పై బీఎల్‌ఏ సంతకం తీసుకోవాలన్నారు. డబుల్‌ చెక్‌ చేసుకోవాలని, రెండు బ్యాలెట్లు ఉన్నాయని తెలిపారు. హ్యాండ్‌ బుక్‌ చదుకోవాలని, మాక్‌ పోల్‌ నిర్వహించాలన్నారు. 13 న ఉదయం 7నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ ఉంటుందని, ఈవీఎం నిర్వహణలో కాని, వివిధ రకాల ఫారాలు నింపడంలో కాని మరేదైనా చిన్న అనుమానం వచ్చినా ఇక్కడే మాష్టర్‌ ట్రైనర్‌ ద్వారా నివృత్తి చేసుకోవాలని, ఏ తప్పు జరగడానికి వీలు లేదని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు విధుల పట్ల కఠినంగా ఉండాలని సూచించారు. అలాగే పోస్టల్‌ బ్యాలెట్‌ జరిగే విధానంను తనిఖి చేశారు. శిక్షణలో కలెక్టర్‌తో పాటు అడిషనల్‌ కలెక్టర్లు మయాంక్‌ మిత్తల్‌, అశోక్‌కుమార్‌, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ గరిమా నరుల, సంబంధిత అధికారులున్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి

ఈనెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు పోలింగ్‌ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. సోమవారం సింగారం లోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేసిన శిక్షణలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. 12, 13 తేదీలలో పోలింగ్‌ స్టేషన్‌లో ఫ్లోరింగ్‌ టాయిలెట్స్‌, త్రాగునీరు, టెంట్లు లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. 13న ఉదయం టిఫిన్‌, లంచ్‌ ఏర్పాటు చేయాలన్నారు. వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. పోలింగ్‌ స్టేషన్లో వీల్‌ చైర్‌ ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు పోలింగ్‌ రోజు పోలింగ్‌ స్టేషన్‌లోకి వెళ్లరాదన్నారు. 8 పోలింగ్‌ స్టేషన్లో కలిపి ఒక సెక్టోరియల్‌ అధికారిని నియమిస్తారన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ఉన్నది లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే బారికెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఆశ కార్యకర్తలు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనింగ్‌ కలెక్టర్‌ గరీమ నరుల, ఆర్డిఓ మధుసూదన్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement