కలెక్టర్‌ను కలిసిన నూతన డీఎఫ్‌ఓ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన నూతన డీఎఫ్‌ఓ

Published Sat, Oct 19 2024 12:12 AM | Last Updated on Sat, Oct 19 2024 12:12 AM

కలెక్

నారాయణపేట: నాగర్‌కర్నూలు జిల్లా నుంచి బదిలీపై నారాయణపేట జిల్లా మత్స్యశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన సయ్యద్‌ అతికుర్‌ రెహమాన్‌ శుక్రవారం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. జిల్లాలో మత్స్య సంపద పెంచి మత్స్యకారులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా సూచించారు.

మెరుగైనవైద్య సేవలందించాలి

నారాయణపేట: రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలని డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం ప్రపంచ ధర్మశాల దినోత్సవం సందర్భంగా స్థానిక పీసీయూ కేంద్రంలో పాలియేటివ్‌ కేర్‌ దినోత్సవం నిర్వహించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

21 నుంచి పోలీస్‌సంస్మరణ వారోత్సవాలు

నారాయణపేట: జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్టోబర్‌ 21 నుంచి పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒపెన్‌ హౌస్‌ కార్యక్రమాల్లో భాగంగా పోలీసు విధులు, ఆయుధాలు, సాంకేతిక వినియోగం, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, పోలీసులు చేసిన ప్రతిభ, త్యాగాలపై ప్రజలకు తెలియజేయాలిన, ఆన్‌లైన్‌లో htt ps://forms.gle/QEAGUfj3wnDfCo8c6 లింక్‌ ద్వారా వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విచక్షణతో కూడిన మొబైల్‌ వాడకం, తెలంగాణను డ్రగ్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర అనే అంశంపై ఈ పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు అభ్యర్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్‌ఐ స్థాయి వరకు వ్యాసరచన పోటీలు ఉంటాయని, ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పబ్లిక్‌ స్థలాల్లో, పోలీస్‌ అమరవీరులపై కళా బృందంతో పాటల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, 21న పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నందు పోలీస్‌ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ‘స్మతి పరేడ్‌ పోలీస్‌ ఫ్లాగ్‌ డే కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కలెక్టర్‌ను కలిసిన  నూతన డీఎఫ్‌ఓ 
1
1/1

కలెక్టర్‌ను కలిసిన నూతన డీఎఫ్‌ఓ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement