11న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక | - | Sakshi
Sakshi News home page

11న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక

Published Wed, Nov 6 2024 12:31 AM | Last Updated on Wed, Nov 6 2024 12:31 AM

11న మ

11న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక

చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం వస్తారని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి మంగళవారం సాయంత్రం కురుమూర్తిస్వామి ఆలయం వద్ద అధికారులతో కలిసి హెలీప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. సీఎం రాకకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సీఐ రామకృష్ణ, ఆలయ సిబ్బంది తదితరులున్నారు.

మహిళల రక్షణే షీ టీం లక్ష్యం : ఎస్పీ

నారాయణపేట: మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌, యాంటీ ఉమెన్‌ ట్రాఫికింగ్‌ టీంలు పని చేస్తున్నాయని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, యువతులు, బాలికలు ఆకతాయిల వేధింపులకు గురవుతూ ఇబ్బందులు పడుతుంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. గృహహింసకు గురైనా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. షీటీమ్స్‌ ద్వారా జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగామ్‌ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఫొటోలు, వీడియోలు పోస్టుచేసే సమయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నేరుగా సంప్రదించలేని వారు సెల్‌ఫోన్‌ నంబర్‌ 87126 70398 లేదా డయల్‌ 100కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

విద్యార్థులకునష్టం వాటిల్లొద్దు

జిల్లా విద్యాధికారి ఎండీ అబ్దుల్‌ ఘని

నారాయణపేట రూరల్‌: పదోతరగతి విద్యార్థుల వార్షిక పరీక్షల నిమిత్తం పాఠశాలల్లో పూర్తిచేసే నామినల్‌ రోల్స్‌ తప్పులు లేకుండా చూసుకోవాలని జిల్లా విద్యాధికారి ఎండీ అబ్దుల్‌ ఘని సూచించారు. మంగళవారం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టెన్త్‌ ఇన్‌చార్జ్‌ టీచర్లకు వేర్వేరుగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూడైస్‌ ప్లస్లో విద్యార్థుల వివరాలు సరిచూసుకోవాలని, ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అదేవిధంగా అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రశిష్ఠ స్క్రీన్‌ టూల్స్‌ ద్వారా విద్యార్థులకు స్క్రీన్‌ చేయాలని సూచించారు. గతేడాది 18 ఇన్‌స్పైర్‌ అవార్డులు వచ్చాయని అభినందించారు. సైన్స్పరంగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. సెక్టోరియల్‌ అధికారులు నాగార్జున్‌రెడ్డి, రాజేందర్‌, డీఎస్‌ఓ భానుప్రకాష్‌ పాల్గొన్నారు.

కులవృత్తులకు చేయూతే ప్రభుత్వ లక్ష్యం

కోస్గి: రాష్ట్రంలోని కులవృత్తుల వారు ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని కాడా ప్రత్యేకఽ అధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం కోస్గి నాగుల చెరువు, గుండుమాల్‌ పెద్ద చెరువులో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డితో కలిసి ఉచిత చేప పిల్లలు వదిలారు. అలాగే గుండుమాల్‌లోని రైతువేదికలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్‌, తహసీల్దార్లు శ్రీనివాసులు, భాస్కరస్వామి, పుర కమిషనర్‌ నాగరాజు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రఘువర్ధన్‌రెడ్డి, విక్రంరెడ్డి, మాజీ సర్పంచ్‌ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు మధుకర్‌రావు, రాఘవరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రకాష్‌రెడ్డి, పార్టీ పుర అధ్యక్షుడు బెజ్జు రాములు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
11న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక 
1
1/1

11న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement