ఉడకని అన్నం.. నీళ్ల చారు
నారాయణపేట/ధన్వాడ/మక్తల్/మద్దూర్/ కొత్తపల్లి: ఉడికీ ఉడకని, రాళ్లతో కూడిన అన్నం.. నీళ్ల చారు.. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం భుజించలేనంత దారుణంగా ఉంటుంది. దీనికితోడు మధ్యాహ్న భోజనం వండే వంట గదులు అపరిశుభ్రతకు అడ్డాగా మారగా.. నీటి ట్యాంకు శుభ్రతే మరిచారు. దుమ్మూ దూళి నడుమనే ఆరుబయట వంటలు చేస్తుందగా.. సరుకుల నాణ్యత దేవుడెరుగు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. సిబ్బంది ఇష్టారాజ్యంతో మధ్యాహ్న భోజన నాణ్యత కరువైంది. ఇలాంటి ఆహారం తిన్న విద్యార్థులు తరచూ అనారోగ్యం, అస్వస్థతకు గురవుతున్నారు. మాగనూర్‌లో జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు ఆస్వస్థత గురైన ఘటన ఓ ఉదాహరణ. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో ‘సాక్షి’ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేసి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని, పరిసరాలను పరిశీలించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
● మక్తల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 578మంది విద్యార్థులు ఉండగా.. వీరికి మధ్యాహ్న భోజనంలో బాగంగా 66 కేజీల బియ్యంతో అన్నం, వంకాయ కూర వండారు. అయినా కూడా చాలామంది విద్యార్థులు ఇళ్ల్ల నుండి టిఫిన్లు తెచ్చుకొని తింటున్నారు. ఎందుకు అని ప్రశ్నించగా.. భోజనంలో చాలాసార్లు రాళ్లు, పురుగులు వచ్చాయని, ప్రతి రోజు అన్నం సక్రమంగా వడ్డించడంలేదని, నీళ్ల సాంబార్ చేస్తున్నారని తెలిపారు. తాగడానికి నీళ్లు లేక ఉప్పు నీళ్లు తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
● మద్దూరు మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 360 మంది విద్యార్థులను అందించే మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే బియ్యం ముక్కి పోయి చిట్టెలు కట్టాయి. దీంతో చాలా మంది విద్యార్థులు భోజనం చేయడానికి నిరాకరించారు. ఇదే విషయాన్ని వంట మహిళలకు అడిగితే బియ్యమే అలా వస్తుందని, వాటిని శుభ్రం చేయడాకికే చాలా సమయం తీసుకుంటుందని, వీలైనంత వరకు కడిగి అలాగే వండుతున్నామని పేర్కొన్నారు.
● కొత్తపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో 83 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో దాదాపు 4 క్వింటాళ్ల వరకు బియ్యం నిల్వ ఉన్నాయి. బియ్యంలో పురుగులు, చిట్టెం కట్టడంతో వాటిని శుభ్రం చేయడానికి తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా విద్యార్థులకు నాసీరకమైన భోజనం అందుతుంది.
● ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పెట్టె బియ్యం మొత్తం ఉండలు కట్టి పురుగులు పట్టాయి వాటిని తొలిగించి వంట చేస్తున్నా పూర్తి స్థాయిలో తీయలేక వాటిని అలాగే వంట చేస్తున్నారు. గోటూర్ గ్రామంలో వంట ఏజెన్సి నిర్వాహకులు బిల్లులు రావడంలేదని తప్పుకోవడంతో రెండేళ్లుగా హెచ్‌ఎం సొంతంగా వంట మనిషిని పెట్టి వారికి డబ్బులు అందజేస్తున్నారు. శుక్రవారం నీళ్ల సాంబర్, అన్నం చేసి విద్యార్థులు వడ్డించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తీరిది
అపరిశుభ్రంగా వంటగదులు,ఆరుబయటే వంటలు
బియ్యంలో రాళ్లు.. గుడ్డు ధర పెరిగిందంటూ ఎగవేత
నెలల తరబడి శుభ్రం చేయని నీటి ట్యాంకులు
అనారోగ్యం పాలవుతున్న విద్యార్థులు
‘సాక్షి’ విజిట్‌లో పలు విషయాలు వెలుగులోకి..
Comments
Please login to add a commentAdd a comment