రోజూ నీళ్ల చారే..
పాఠశాలలో మధ్యాహ్నం భోజనం సరిగా ఉండదు. తరచూ నీళ్లచారు చేస్తున్నారు. బయటకు వెళ్లాలంటే గేటు తాళం వేసి ఉంటుంది. ప్రతి రోజు ఇబ్బందులు తప్పడం లేదు. అన్నంలో పురుగులు వస్తుండడంతో కొంత మంది విద్యార్థులు ఎవరికి చూపించకుండా పడేస్తున్నారు.
– నవీత, విద్యార్థిని, 10వ తరగతి, మక్తల్
ఆర్నెళ్లుగా టిఫిన్ తీసుకెళ్తుంది..
మరికల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చేసే వంటలు బాగా లేకపోవడంతోనే నా కుతురు ఇంటి నుంచి రోజు భోజనం తీసుకెళ్తుంది. గత ఆరు నెలల నుంచి పాఠశాలలో ఇంటి భోజనమే చేస్తుంది. మొదట్లో మధ్యాహ్న భోజనం చేయడంతో అనారోగ్యం బారిన పడింది. అధికారుల స్పందించి మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టాలి.
– సీమ శ్యామ్, విద్యార్థి తండ్రి, మరికల్
గుడ్లు ఇవ్వడం లేదు
నారాయణపేట బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గుడ్లను అందించడం లేదు. అదనపు ఖర్చు అవుతుందని నిర్వాహకులు తేవడం లేదు. ఈ ఏడాది జూలై నుంచి గుడ్డు ఉడక బెట్టలేదు. విద్యార్థులకు అందించలేదు. గుడ్లకు సంబంధించిన బిల్ చేయకుండా కేవలం అన్నం కూరగాయలకు మాత్రమే బిల్ చేస్తున్నాం.
– సత్యనారాయణ సింగ్, హెచ్‌ఎం, బాలికల ఉన్నత పాఠశాల, నారాయణపేట
●
Comments
Please login to add a commentAdd a comment