నర్సింగ్ కళాశాల ప్రారంభం
నారాయణపేట: జిల్లాకు ఇటీవలే మంజూరైన నర్సింగ్ కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికావస్తున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా సోమవారం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో జరిగిన ఆరోగ్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి నుంచే ప్రారంభించారు. అందులో భాగంగా నారాయణపేట నర్సింగ్ కళాశాలను కూడా వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. కాగా ముఖ్యమంత్రి ఆరోగ్య ఉత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు నారాయణపేట మండలంలోని అప్పక్‌పల్లి వద్ద గల మెడికల్ కళాశాల సమావేశ మందిరం వేదిక అయింది. సీఎం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ బేన్ షాలం, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లకి్‌ష్మ్, నర్సింగ్, పారామెడికల్ విద్యార్థులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జయ, మెడికల్ కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.
చదువుతోపాటు
క్రీడల్లో రాణించాలి
మరికల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం మరికల్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. అనంతరం పదో తరగతి పరీక్షలకు సంబందించి ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులకు అర్థవంతమైన పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలని, పరీక్షలు రాసే విధానంపై మెలకువలు నేర్పించాలని, ఒత్తిడి జయించేలా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.
ఎర్ర కందులు క్వింటా రూ.11వేలు
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం ఎర్ర కందులు క్వింటా గరిష్టంగా రూ.11,621, కనిష్టంగా రూ.9,311 ధర పలికాయి. అలాగే, తెల్ల కందులు గరిష్టంగా రూ.11,621, కనిష్టంగా రూ.10 వేలు ధర పలికాయి.
భక్తులకు ఇబ్బందులు
కల్గించొద్దు : ఎమ్మెల్యే
మక్తల్: శ్రీ పడమటి ఆంజనేయస్వామి జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గించొద్దని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్‌లో శ్రీ పడమటి ఆంజనేయస్వామి జాతర సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈనెల 13 నుంచి 19 వరకు నిర్వహించే ఉత్సవాలలో భక్తుల కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. రాంలీలా మైదానంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, రోడ్డుకు రెండు వైపుల వీధిలైట్లు అమర్చాలన్నారు. ట్రాఫిక్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కల్గురాదన్నారు. విద్యుత్, తాగునీటి, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఎ మ్మెల్యే విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, బీకేఆర్ బాలకృష్ణారెడ్డి, మక్తల్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్, ఆలయ చైర్మన్ ప్రణేష్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment