మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మక్తల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా సంఘాలకు రూ.3.83 కోట్ల రుణాల చెక్కులను మహిళా సంఘాల గ్రూప్ లీడర్లకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం ఖాయమని అన్నారు. మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకొని స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని, ఆర్థికాభివృద్ధి సాధించాలని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి మక్తల్‌కు ఇంటిగ్రెటెడ్ స్కూళ్లు, రూ.170 కోట్లు మంజూరు చేశారన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరిదిలో చెత్తాచెదారం, నీరు మళ్లింపు, ముందస్తు వర్షాకాలం పనులకుగాను నూతనంగా కొనుగోలు చేసిన జేసీబీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా, మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులకు పీపీ కిట్లను ఎమ్మెల్యే అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, కమిషనర్ బోగేశ్వర్, మండల కాంగ్రెస్ అద్యక్షుడు గణేష్‌కుమార్, కోళ్ల వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు రవికుమార్, కౌన్సిలర్లు మొగులప్ప, సత్యనారాయణ, రాములు, నారా యణ, వంశోద్దిన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment