ప్రజల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి..
అలంపూర్: రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఆయన కుటుంబసమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌ఏ సంపత్‌కుమార్ టీపీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా ఆలయాలకు చేరుకున్నారు. ఆలయ ఈఓ పురేందర్‌కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి అర్చకస్వాములుతో కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బాలబ్రహ్మేశ్వరస్వామి, శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అర్చకులు తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయని, ఈ రోజుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు వాగ్దానాలు ఇవ్వడం తప్పా చేసింది ఏమి లేదన్నారు. బీఆర్‌ఎస్ చెప్పు కుంది రూపాయ చారణ అయితే చేసింది చారణ మాత్రమే అన్నారు. అందుకు తగ్గ ట్టుగా వారు పదేళ్లలో చేయలేని కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 మాసాల్లోనే చేపట్టినట్లు పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదన్నారు. ప్రజల మన్నలు పొందుతున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా రెండవసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
కుటుంబసమేతంగా జోగుళాంబదేవిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment