ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలి
నారాయణపేట రూరల్: ప్రతి పోలీసు క్రమశిక్షణను కలిగి ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం స్పెషల్ పార్టీ పోలీసులతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో స్పెషల్ పార్టీ పోలీసులు కీలకపాత్ర వస్తారని జిల్లా పోలీసులకు వెన్నెముకగా ఉంటూ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించడం జరుగుతుందన్నారు. స్పెషల్ పార్టీ పోలీసులు అత్యవసర సమయంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని సూచించారు. పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనదని, మారుతున్న పరిస్థితుల క్రమంలో స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు విధుల్లో కీలక పాత్ర వహిస్తారని తెలిపారు. అల్లర్లు, ధర్నాలు, రాస్తారోకోల సమయంలో సంయమనంతో ఉండాలని పైఅధికారుల సూచనల మేరకు నడుచుకోవాలని తెలిపారు. పోలీసు శాఖలో ఎవరైనా ఎలాంటి తప్పులు చేసిన యావత్ పోలీసులకు చెడ్డ పేరు వస్తుందని, కావున ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించారు. అలాగే ట్రైనింగ్ లో నేర్చుకున్న అన్ని గుర్తుపెట్టుకోవాలని ఏలాంటి విధులైన నిర్వర్తించే విధంగా మానసికంగా, దృఢత్వంతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. అలాగే జిల్లా పోలీసుల సంక్షేమం కోసం స్పెషల్ పార్టీ పోలీసులకు ప్రత్యేక రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని శాలరీతోపాటు అన్ని అలవెన్స్‌లు ఇవ్వడం జరుగుతుందని, అందరికీ వీక్లి ఆఫ్ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నరసింహ, ఆర్ ఎస్ ఐ శివశంకర్, రాములు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment