అడిషనల్ ఎస్పీనిఅభినందించిన డీజీపీ
నారాయణపేట రూరల్: ఇటీవల బెంగళూర్‌లో జరిగిన ఆల్ ఇండియా లాన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణపేట అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ జంట చక్కటి ప్రతిభ కనబరిచారు. వారు సాధించిన విజయానికి మంగళవారం డీజీపీ డాక్టర్ జితేందర్ తన కార్యాలయంలో వారిని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పోలీసులు విధి నిర్వహణతో పాటు క్రీడల్లోను రాణించాలన్నారు.
మారింది పాలకులే.. పాలన కాదు
నారాయణపేట రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వ పాలకులు మారారు కానీ పాలన మారలేదని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల గారడితో 6 అబద్ధాలు 66 మోసాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. రైతు రుణమాఫీ చేయలేదని, ఏడాది అయినా రైతు భరోసా లేదని, మహాలక్ష్మి పేరుతో మహిళలను మోసం చేశారని అన్నారు. గృహజ్యోతితో మహిళలను మోసం చేశారని, వృద్ధులకు చేయూత అందించలేదని, యువత వికాసం మరిచారని, సొంతిళ్లు కలగానే మిగిలిపోయిందని విమర్శించారు. ఆన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడ్డారని అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దోచుకోవడంలో రెండు పార్టీలు ఒక్కటేనని, అంతే కాకుండా పదేళ్లు బీఆర్‌ఎస్ కే.ట్యాక్స్ ఇప్పుడు కాంగ్రెస్ ఆర్‌ఆర్ ట్యాక్స్ చెల్లిస్తున్నదని విమర్శించారు. నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి ప్రధానిపై అసందర్భ విమర్శలు చేస్తున్నారని, వారికి ఆ అర్హత లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేసిన గ్యారెంటీలపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజాయితీ ఉంటే ఒక్క హామీనైన అమలు చేశామని బహిర్గతం చేయాలన్నారు. ఏమి చేయకుండానే ఉత్సవాలు చేస్తారని ఎద్దేవా చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, సీనియర్ నాయకులు నర్సన్ గౌడ్ ,రామచంద్రయ్య,ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, కోశాధికారి సిద్ది వెంకట్ రాములు,పట్టణ అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సత్యరఘుపాల్ పాల్గొన్నారు.
క్రిస్మస్ సత్కారాలకు
నామినేషన్ల స్వీకరణ
నారాయణపేట రూరల్: ఈ నెల 25న జరిగే క్రిస్మస్ పండుగ సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం సత్కారాలు అందిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ అధికారి ఏం ఏ రషీద్ తెలిపారు. సామాజిక రంగం, విద్యా రంగం, వైద్య రంగం, సాహిత్యం, కళా రంగం, క్రీడా రంగాలలో ఉత్తమ సేవ ప్రతిభ కనబరచిన ప్రతిభావంతులైన క్రైస్తవులు, సంస్థలకు చెందిన ప్రతినిధులకు అవకాశం ఉంటుందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా సామాజిక పని, వైద్యం, విద్య, సాహిత్య సాధనలు, లలిత కళలు, థియేటర్, క్రీడలు వంటి లౌకిక రంగాలలో వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు, సన్మానానికి అర్హులని పేర్కొన్నారు. ఆరోగ్యం, విద్య, సామాజిక సేవా రంగాలు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదని, ఎంపికై న నామినీలను క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో సత్కరిస్తారని తెలిపారు. నామినేషన్ ఫారాలు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని5వ తేదీలోగా జిల్లా మైనారిటీస్ సంక్షేమ కార్యాలయంలో అందజేయలని కోరారు. ఇతర వివరాలకు ఫోన్ నం. 04023391067ను సంప్రదించాలని తెలిపారు.
రేపు పీయూలో
ప్రాంగణ ఎంపికలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో గురువారం ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పీయూ ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహిస్తారని, ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులు సెమినార్‌హాల్‌లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment